లిప్టు పెట్టి వాడుకుంటే… తప్పేముంది : జగన్
1 min readపల్లెవెలుగు వెబ్ : కృష్ణా జలాల విషయంలో తెలంగాణ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోన్న రైతు దినోత్సవంలో భాగంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాలపై తెలంగాణ, కోస్తా, రాయలసీమకు వాటా ఉన్న సంగతి తెలిసిందేనని, జలాల కేటాయింపులపై గతంలో ఒప్పందాలు జరిగాయని చెప్పారు. ‘ గతంలో ఉమ్మడి ఏపీకీ 811 టీఎంసీలు కేటాయించారు. శ్రీశైలం పూర్తీ స్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులు. 881 అడుగులకు నీరు చేరితే తప్ప కిందకు రాని పరిస్థితి. సీమ ఎత్తిపోతలకు 881 అడుగుల్లో లిప్టు పెట్టి వాడుకుంటే తప్పేముంది.’ అని సీఎం జగన్ అన్నారు. పక్క రాష్ట్రాలతో సఖ్యత కోరుకుంటున్నామని, రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు.