షావోమీకి ఈడీ షాక్ !
1 min readపల్లెవెలుగువెబ్ : చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కారణంగా షావోమీ 23 శాతం షిప్‌మెంట్ తగ్గినట్లు (ఇయర్ టూ ఇయర్) ఇండియా మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్ రిపోర్ట్ అందించే సైబర్ మీడియా రీసెర్చ్ వెల్లడించింది. షావోమీకి సబ్ బ్రాండ్‌గా ఉన్న పోకో సైతం షిప్‌మెంట్ 14శాతం తగ్గినట్లు సైబర్ మీడియా రీసెర్చ్ నివేదించింది. కానీ షావోమీ భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో 20 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా శాంసంగ్ 18శాతం, రియల్ మీ 16శాతంతో తొలి 3 స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత వివో 15శాతం, ఒప్పో 10శాతం మార్కెట్‌తో కొనసాగుతున్నాయి.