NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

షావోమీ హెడ్ బ్యాండ్.. మ‌నం చెప్పిన‌ట్టు చేస్తుంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్ల ఉత్పత్తి సంస్థ షావోమి.. మనిషి మెదడులోని ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే హెడ్‌బ్యాండ్‌ను రూపొందించబోతున్నట్లు ప్రకటించింది. ఎంఐజీయూ హెడ్‌బ్యాండ్‌ పేరుతో దీన్ని రూపొందిస్తున్నామని, ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పరిజ్ఞానంతో పనిచేస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఇంట్లో ఉండే స్మార్ట్‌ పరికరాలు– టీవీ, లైట్‌, ఫ్యాన్‌ తదితరాలను ఈ హెడ్‌బ్యాండ్‌ రిమోట్‌ కంట్రోల్‌ మాదిరిగా నియంత్రిస్తుంది. అందుకు మాన్యువల్‌గా కమాండ్స్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగని.. స్మార్ట్‌ఫోన్లలో ఉండే ఫీచర్ల ఆధారంగా నియంత్రించాల్సిన పనిలేదు. కేవలం మనిషి ఆలోచనతో ఈ హెడ్‌బ్యాండ్‌ ఆయా పరికరాలను నియంత్రిస్తుంది. ‘‘ఈ హెడ్‌బ్యాండ్‌ ద్వారా మెదడు సిగ్నళ్లను అందుకునేందుకు, యూజర్‌ ఎలకో్ట్ర ఎన్సెఫాలోగ్రఫీ(ఈఈజీ) వేవ్‌ఫామ్స్‌ చదివేందుకు సెన్సర్లుంటాయి. యూజర్ల మూడ్‌ ఆధారంగా.. ఎమోషన్స్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే వేవ్‌ఫామ్స్‌ను హెడ్‌బ్యాండ్‌లోని ఆర్టిఫిషియల్‌ లేబుల్డ్‌ మెషీన్‌ గ్రహిస్తుంది. వాటి ఆధారంగా మనిషి ఆలోచనలను ఈ హెడ్‌బ్యాండ్‌ అమలు చేస్తుంది’’ అని షావోమీ ప్ర‌తినిధులు వివరించారు.

                                               

About Author