“వై.యస్.ఆర్. ఆసరా” 3వ విడత జమ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరం లోని ఎ-క్యాంపు కూడా కార్యాలయం నందు జరిగిన వై.యస్.ఆర్. ఆసరా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు, నగర అధ్యక్షురాలు, కార్పొరేటర్లు,పార్టీ ముఖ్య నాయకులు “వై.యస్.ఆర్. ఆసరా” కార్యక్రమాన్ని మూడవ సంవత్సరం మీ చల్లని ఆశీస్సులతో ఈ నెల అనగా 25 వ తేది మార్చి నెల 2023 నాడు పొదుపు సంఘారాల ఖాతాలలో జమ చేసిన ఏకైక మన వైయస్సార్ ప్రభుత్వం, జగన్ అన్న ప్రభుత్వం అన్ని చెప్పటానికి నేను ఎంతగానో సంతోషిస్తూ అక్క చెల్లెమ్మలందరికి హృదయపూర్వక అభినందనలలు : కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ వై.యస్.ఆర్ ఆసరా కర్నూలు మహిళ లబ్ధిదారులకు వై.యస్.ఆర్. ఆసరా పథకం ద్వారా 3034 గ్రూపులకు 30340 మంది కి “వై.యస్.ఆర్. ఆసరా” 3వ విడత జమ 19,90,50,000/- చెక్ ను అందజేస్తున్న కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ . వై.యస్.ఆర్ ఆసరా కర్నూలు మహిళ లబ్ధిదారులకు అందరూ కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ఖాన్ గారితో కలిసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగింది. కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల వలే ఇది మాటల ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం అని, మ్యానిఫెస్టో అంటే అంకెల గారడి కాదు, అది ఒక పవిత్రమైన భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్ లా భావించి ఇచ్చిన మాటకు కట్టుబడి, ఇచ్చిన హామీని తేదీల వారీగా అమలు చేయుటకు లెండర్ ను ముందుగానే ప్రకటించి ఈ మూడున్నర సంవత్సరాలలోనే 93.5% హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం మనదే అన్ని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ గారు అన్నారు.గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి తరువాత మోసం చేసిన పరిస్థితులలో,మహిళలు ఆ ఋణాలు కట్టలేక చివరకు వడ్డీ కూడా చెల్లించలేక, రుణభారం తడిసి మోపెడు అయ్యి అక్క చెల్లెమ్మలు రుణాలు కట్టలేని దయనీయమైన పరిస్థితుల లోకి నెట్టబడ్డారు. దీని వల్ల మహిళా సంఘాలు చిన్నాభిన్నం అయ్యి, “ఎ” గ్రేడ్ లో ఉన్న సంఘాలు కూడా “సి”,” “డి” గ్రేడ్ లోకి పడిపోయాయి అన్ని అన్నారు.ఈ కార్యక్రమం లో నగర అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ గారు, సీనియర్ నాయకుడు గడ్డం రామకృష్ణ గారు,కార్పొరేటర్లు 13వ వార్డ్ విజయలక్ష్మి గారు,14వ వార్డ్ కో ఆప్షన్ మెంబర్ శ్రీరాములు గారు,17వ వార్డ్ కైపా పద్మాలతా రెడ్డి గారు,18వ వార్డ్ పల్లవిమ్మ గారు, మెప్మా పీ.డీ నాగశివలీల గారు,కన్వీనర్లు,వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్య నాయకులు వార్డ్ నాయకులు, టి.ఆర్.ఓ వెంకటలక్ష్మి, టి.యం.సి, సుధాకర్, సి.యం.యం, టి.ఎల్.ఎఫ్, ఎస్.ఎల్.ఎఫ్,ఆర్.పి లు, హెచ్.ఆర్. పి లు,ఓ.బి లు, పొదుపు మహిళలలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.