మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు యాగంటి క్షేత్రం ముస్తాబు
1 min read– 17నుంచి 21 వరకు బ్రహ్మోత్సవాలు
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: బనగానపల్లె మండలం లో ఈ నెల 17 నుంచి 21 వరకు యాగంటి క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో బి చంద్రశేఖరరెడ్డి, చైర్మన్ తోట బుచ్చిరెడ్డిలు బుధవారం తెలిపారు. 17న శుక్రవారం ఉదయం 8 గంటలకుధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. శనివారం మహా శివరాత్రి పర్వదినాన ఉదయం 5 గంటలకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, కుంకుమార్చన , సహస్ర నామావళి కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అదే రోజున అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.19న తెల్లవారుజామున 4.30గంటలకు (తెల్లవారితే ఆదివారం) శ్రీ ఉమామహేశ్వరస్వామి వార్ల కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే రోజు రాత్రి రెలారే రెలా, జబర్దస్త్ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 19 ఆదివారం సాయంత్రం 4 గంటలకు నందికోల ఉత్సవం, 20న సోమవారం స్వామివార్ల రథోత్సవం ఉంటాయన్నారు. 21 మంగళవారం శివదీక్షా విరమణ, పూర్ణాహుతి, నాగవళ్లి, వసంతోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా విచ్చేసే భక్తులకుఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ప్రత్యేక క్యూ లైన్ ద్వారా స్వామి దర్శనం కల్పిస్తున్నామని, వేసవితాపం గురికాకుండా క్షేత్రం అంతటా షామియనాలు,భక్తుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేది తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.భక్తులసేవలో అన్నదానసత్రాలుబ్రహ్మోత్సవాలకు విచ్చేసి భక్తులకు అన్నదాన వితరణ కావించేందుకు ఆలయ పరిధిలోని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ ఉమామహేశ్వరస్వామి నిత్యాన్నదానసంస్థ, ఉమామహేశ్వర రెడ్ల అన్నదాన సంస్థ, ఆర్యవైశ్య వాసవి నిత్యాన్నదాన సంస్థ, గాయత్రి బ్రాహ్మణ అన్నదాన సంస్థ, బసవేశ్వర నిత్యాన్నదాన సంస్థలు భక్తులకు భోజన వసతిని కల్పిస్తున్నాయి.