PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈశ్వర విషయమైన జ్ఞానమే యజ్ఞము

1 min read

– డాక్టర్ మల్లు వేంకటరెడ్డి. 

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈ సృష్టిలో శాశ్వతమైనదేది, అశాశ్వతమైనదేది అనే సత్యాన్ని తెలిపేదే నిజమైన యజ్ఞమని దీనినే జ్ఞాన యజ్ఞము అని పేరని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆస్పరి మండలం, పుటుకులమర్రి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ధార్మిక సప్తాహాన్ని ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానములు గ్రామగ్రామాన సనాతన భారతీయ వైదిక ధర్మవ్యాప్తికోసం కృషి చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలోని దేవాలయం కేంద్రంగా ప్రముఖులచే ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండళ్ళను ప్రోత్సహిస్తూ, స్థానిక ఆలయాలలో భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ, తిరుమలలో జరిగే అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించబడుతుందని అన్నారు. ప్రవచకులు పి.వి.రమణమూర్తి చేసిన శ్రీమద్రామాయణంపై చేసిన ప్రవచనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అర్. విశాలక్ష్మి శివారెడ్డి,టి. జగన్నాధ్ రెడ్డి, వీరారెడ్డి, మోహన్ రెడ్డి, చంద్రారెడ్డి, అర్చకులు జె. రంగస్వామి భజన గురువు కురువ లోకేశ్, భజన మండలి అధ్యక్షులు భాస్కర రెడ్డి, హార్మోనిష్టు కురవ సంజన్న, తబలిష్టు బోయ రామాంజనేయులు, ఈడిగ చిన్న సుంకన్న, బోయ నాగరాజు, కె.పెద్దాంజనేయులు, కె. లక్ష్మణ్ణతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author