యాసిన్ మాలిక్ కు యావజ్జీవ కారాగార శిక్ష
1 min readపల్లెవెలుగువెబ్ : ఉగ్రవాదులు, ఉగ్రకార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు పటియాలా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. వాస్తవానికి యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష విధించడమే సరైన శిక్ష అని ఎన్‌ఐఏ కోర్టుకు సూచించింది. అయినా న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ మాత్రం యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.