వైసీపీ అభ్యర్థి సుధీర్ ధారా తక్షణమే క్షమాపణ చెప్పాలి
1 min readకులలకతీతంగా రాజకీయ నాయకులు వ్యవహరించాలి
డాక్టర్ సుధీర్ దార వ్యవహార శైలి మార్చుకోవాలి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాజకీయ నాయకులు కుల మతాలకు అతీతంగా మాట్లాడాలని ఒక కులాన్ని, ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడటం తగదని నందికొట్కూరు నియోజకవర్గ ప్రజా, కుల సంఘాల నేతలు ప్రశ్నించారు. నందికొట్కూరు నియోజకవర్గ అతిథి గృహంలో ప్రజా సంఘాలు,కుల సంఘాల ఆధ్వర్యంలో చర్చ గోష్ఠి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు కులాలకు మతాలకతీతంగా ఉంటారని అలాంటి వారి మధ్య చిచ్చు పెట్టడం తగదని ఇప్పటికైనా డాక్టర్ సుధీర్ ధార వ్యవహార శైలి మార్చుకోవాలని వెంటనే సుధీర్ ధారా మాట్లాడటం తప్పు అని ఒప్పుకోవాలని తెలుగుదేశం పార్టీ నేత లాయర్ జాకీర్ హుస్సేన్ , ఎం ఆర్ పి ఎస్ నాయకులు స్వాములు మాదిగ, రాజు మాదిగ,మాల మహానాడు అధ్యక్షుడు నగేష్, మాల మహానాడు నేతలు రాజు,వైకాపా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు సగినేల వెంకట రమణ,మహిళా నాయకురాలు శోభారాణి ,సిపిఐ కార్యదర్శి శ్రీనివాసులు, నంద్యాల డిమాండ్ చేశారు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రాంతం గురించి అవగాహన లేకుండా ఇలాంటి వాక్యాలు చేయడం తగదన్నారు.అన్ని కులాలను సమన్వయం చేసుకుంటూ పోతేనే నాయకుడు గా ఎదుగుతావని హితవు పలికారు. నందికొట్కూరు ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఉద్యమం తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎం ఆర్ పి ఎస్ ,మాల మహానాడు, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం,ఎస్దిపిఐ, జనసేన, బీసీ సంఘం,ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.