NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిపాలనలో..వైసీపీ విఫలం..!

1 min read

– మంత్రాలయం టిడిపి ఇన్​చార్జ్​ పాలకుర్తి తిక్కారెడ్డి

మంత్రాలయం, పల్లెవెలుగు: వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ఆరోపించారు. గురువారం  మంత్రాలయం పంకజ హోటల్ లో లో విలేకరుల సమావేశంలో జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో 85 శాతం విఫలం బుక్ లేట్ లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టో, నవరత్నాలు అమలు చేయడంలో పూర్తిగా జగన్ విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. పాదయాత్రలో  మాటలు తప్ప అధికారంలోకి వచ్చాక ప్రజలకు చేసిందేమీ లేదని యువతకు ఉపాధి, ఉద్యోగాలు ఇవ్వక యువతను మోసం చేశాడని ఆరోపించారు. ఉద్యోగస్తులకు సి పి యస్ రద్దు చేస్తానని చేయలేక ఇప్పుడు  ఉద్యోగస్తులకు జీతాలు సరిగా ఇవ్వక వారిని అనేక ఇబ్బందులు పెట్టడమే కాక వారిని అనేక విషయాల్లో మోసం చేశాడని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకత మొదలైందని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ను ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, మంత్రాలయం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ జండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  మండల కన్వీనర్ పన్నగ వెంకటేష్ స్వామి, సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి,యం పి టి సి సభ్యులు మేకల వెంకటేష్, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, హండే హనుమంతు, చిన్న భీమన్న, పౌలు, సున్నం రాఘుు, మేకల నర్సింహులు, యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి యోబు తదితరులు పాల్గొన్నారు.

About Author