PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి

1 min read

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

పారిశుద్ధ కార్మికుల సమ్మెకు  జనసేన  మద్దతు

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జనసేన అధినేత  పవన్ కళ్యాణ్  ఆదేశాల మేరకు నందికొట్కూరు పట్టణంలోని  మున్సిపల్  పారిశుద్ధ్య కార్మికుల 10వ రోజు సమ్మెకు  నందికొట్కూర్ నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం పార్టీ సమన్వయ బాధ్యులు నల్లమల రవికుమార్ ,జనసేన నాయకులు  మధు, రాజు, చిన్న,బిసన్న, శ్యామ్, బాలరాజు, కిషోర్,రవి, తిరుమల,దానమయ్య, మద్దిలేటి, హుస్సేన్,రమేష్, రామకృష్ణ లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నల్లమల రవికుమార్  మాట్లాడుతూ కరోన సమయంలో కార్మికులు చేసిన సేవలు మరవలేనివన్నారు.జగన్ పాదయాత్ర సమయంలో పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేసి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత విస్మరించడం మోసం చేయడమేనని ఆరోపించారు. గత నాలుగున్నర ఏళ్లుగా కార్మికులు సహనం కోల్పోయి సమ్మెకు దిగారని తెలియజేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలో ఘోరంగా విఫలం చెందారని మండిపడ్డారు. ఆప్కాస్ తీసుకువచ్చి కార్మికుల నోట్లో మట్టి కొట్టారని ఆవేదన చెందారు. ఆప్కాస్ ఫలితంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఇతరులకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదని ఆవేదన చెందారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వకపోగా, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు దూరం చేశారని దుయ్యబట్టారు. కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్ గా పని చేసి మరణించిన కార్మికులకు వారి కుటుంబాలను ఆదుకునేలా రూ.5 లక్షల బీమా తో వారి కుటుంబాలు ఆకలి కేకలతో అలమ కార్మిక సమస్యలు పరిష్కరించకపోవడంతో జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మొన్న అంగన్వాడీలు, నిన్న ఆశా వర్కర్లు, నేడు మున్సిపల్ కార్మికులు,  సమ్మె చేస్తున్నారంటే పరిపాలన చేయడంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి  ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. సమానం వేతనం వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ,గ్రాట్యుటీ ఔట్ సోర్సింగ్ కార్మికులందరికి పర్మినెంట్ చెయ్యాలి సగం పెన్షన్ ఇవ్వాలి .అలవెన్స్ జీత భ్యతలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం , కార్యదర్శి గోపాలకృష్ణ ,రైతు సంఘం నాయకులు కొణిదెల రాజు, తదితరులు పాల్గొన్నారు.

About Author