వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులతో రైతుల గొంతు నొక్కుతుంది
1 min readబొజ్జ దశరథ రామిరెడ్డిని తక్షణమే విడుదల చేయాలి
నందికొట్కూరు సబ్ జైలులో బొజ్జ దశరథ రామిరెడ్డి టీడీపీ నాయకుల పరామర్శ
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథ రామిరెడ్డి పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం వైసీపీ ప్రభుత్వ కుట్రలో భాగమేనని నంద్యాల టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఆరోపించారు. బొజ్జ దశరథ రామిరెడ్డి ని తక్షణమే విడుదల చేయాలని అన్నారు.నందికొట్కూరు సబ్ జైలులో రిమాండ్ లో ఉన్న బొజ్జ దశరథ రామిరెడ్డిని బుధవారం టీడీపీ నాయకులు నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డిలు పరామర్శించారు.ఈ సందర్భంగా భూమా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు.2016 సిద్దేశ్వరం వద్ద చేపట్టిన ఉద్యమంలో ఆయన పై ఎలాంటి కేసులు నమోదు కాలేదు.ఈ విషయం ఆనాడే పోలీసులు సృష్టంగా ఆయనకు తెలియజేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం సాగునీటి కోసం గ్రామ గ్రామానికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయాన్ని రైతులకు వివరిస్తూ సాగునీటి విషయం లో ప్రభుత్వం విఫలమైందని తెలియజేయడమే ఆయన చేసిన నేరమా అని ప్రశ్నించారు.దశరథ రామిరెడ్డి అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నందికొట్కూరు సబ్ జైలులో బొజ్జ దశరథ రామిరెడ్డి..
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డిని నందికొట్కూరు సబ్ జైలుకు మంగళవారం సాయంత్రం రిమాండ్ పై వచ్చారు. రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు, ఉద్యమ నేత బొజ్జా దశరథ రామిరెడ్డిని మంగళవారం నంద్యాలలో పోలీసులు ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు నంద్యాలలోని కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి ఆత్మకూరు పోలీస్ స్టేషను తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయనను స్థానిక కోర్టులో హాజరపరిచారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆత్మకూరు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బొజ్జా దశరథరామిరెడ్డికి పది రోజులు పాటు జుడిషియల్ రిమాండ్ కు ఆదేశించడంతో నందికొట్కూరు సబ్ జైలుకు తరలించారు. సబ్ జైల్లో ఆయనను పరామర్శించేందుకు టీడీపీ నాయకులు రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు బుధవారం నందికొట్కూరు సబ్ జైలుకు భారీగా తరలివచ్చారు. నాయకుల వెంట నందికొట్కూరు టీడీపీ నాయకులు రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గిత్త జయసూర్య, మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు సాయి కొండ మద్దిలేటి, రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షకీల్ అహమ్మద్,ఐటీడీపీ నియోజకవర్గ ఇంచార్జి మూర్తుజావలి, నంద్యాల రైతు సంఘం నాయకులు బాలీశ్వర రెడ్డి, తిరుపతి రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రామ చంద్ర రెడ్డి, గౌస్, తదితరులు ఉన్నారు.