వైసీపీ.. అసమర్థ పాలన..!
1 min read– ఆక్సిజన్ అందక సంభవించిన మరణాలు.. ప్రభుత్వ హత్యలే
పల్లెవెలుగు వెబ్, కడప : రాష్ట్రంలో కోవిడ్ బాధితులు పిట్టల్లా రాలిపోతుంటే… సీఎం వైఎస్ జగన్ రెడ్డి నియంత్రించలేకపోతున్నారని, ఆక్సిజన్ అందక చనిపోయిన కోవిడ్ మృతులన్నీ… ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు టీడీపీ కడప నియోజకవర్గ బాధ్యులు వీఎస్ అమీర్‌బాబు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని బుధవారం రాత్రి తన నివాసంలో క్యాండిల్ వెలిగించి అశ్రు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీఎస్ అమీర్‌బాబు మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డి మూర్ఱత్వంతోనే కోవిడ్ బాధితులు ఆక్సిజన్ అందక మృతి చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆక్సిజన్ అందక 76 మది మృతి చెందారని, అవన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు.