PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ మునిగిపోయే నావ…

1 min read

డీపీతోనే సంక్షేమ పాల‌న సాధ్యం.

వైసీపీ అరాచ‌క పాల‌న‌లో ప్ర‌జ‌లు విసిగిపోయారు.

తెలుగుదేశం పార్టీ పాల‌న‌లోనే ప్ర‌జ‌ల‌కు సంక్షేమ పాల‌న

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  రాష్ట్రంలో విధ్వంసకర అరాచక పాలన కొనసాగుతోందని గత నాలుగున్నర ఏళ్లుగా వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వైసీపీ మునిగి పోవే నావ అని టీడీపీ తోనే సంక్షేమ పాలన సాధ్యమని రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గిత్త జయసూర్య అన్నారు. సోమవారం పగిడ్యాల మండలం పాలమర్రి గ్రామంలో సోమవారం భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం మండలం కన్వీనర్ పలుచాని మహేశ్వ ర రెడ్డి ,టీడీపీ నాయకులు పుల్యాల వాసు రెడ్డి , దామోదర్ రెడ్డి, ఓగిలి శ్రీనివాసులు  ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ  టీడీపీ అధికారంలోకి రాగానే భవిష్యత్‌కు గ్యారంటీతో ప్రకటించిన పథకాలను అన్నింటిని తక్షణమే అమలు చేస్తుందని తెలిపారు. టీడీపీతో సంక్షేమ పాల‌న సాధ్య‌మ‌వుతుంద‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌ని అందుకే ప్ర‌జ‌లు టీడీపీని కోరుకుంటున్నార‌ని తెలిపారు. వైసీపీ ప్రజావ్య‌తిరేక విధానాల‌తో ప్ర‌జ‌లు విసిగి పోయార‌ని, కూల్చ‌డం, క‌క్ష సాధించ‌డమే జ‌గ‌న్‌రెడ్డికి తెలిసిన పాల‌న అని తెలిపారు. లోకేష్‌ నిర్వహించిన యువగళం పాదయాత్రలో ఐదువేలకు పైగా సమస్యలను ప్రజలు తెలిపితే వాటిలో ఒక్కటి కూడా ప్రభుత్వం పరిష్కారం చేయలేదన్నారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్పులు చేసుకున్నా గెలుపు ఉండదన్నారు. తెలుగు దేశం ముందు ఉన్న ఏకైక లక్ష్యం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకో వడమేనన్నారు. అదేవిధముగా కొన్ని పంచాయ‌తీల్లో తాగునీరు కూడా అంద‌ని ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌న్నారు. గ్రామాల్లో ర‌హ‌దారులు పాడై ప్ర‌జ‌లు అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని తాను గ్రామాల్లోకి వెళ్తున్న స‌మ‌యంలో స‌మ‌స్య‌ల‌పై ఏక‌రువు పెడుతున్నార‌ని తెలిపారు. వైసీపీ మునిగిపోయే నావ అని అందుకే నాయ‌కులంద‌రూ ఒక్కొక్క‌రిగా ప‌డ‌వ దిగిపోతున్నార‌ని అన్నారు. టీడీపీ  జ‌న‌సేన పొత్తు స్పీడ్‌కు ఫ్యాన్ రెక్క‌లు విరిగిపోవ‌డం ఖాయ‌మ‌ని తెలిపారు. స్థానిక నాయ‌కులు మాట్లాడుతూ వైసీపీకి ఓటు వేయ‌క‌పోతే మీ సంక్షేమ ప‌థ‌కాలు ఆగిపోతాయ‌ని బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డం చూస్తే వారిలో ఓటమి భ‌యం స్ప‌ష్టంగా క‌న్పిస్తోంది  విన్పిస్తోంద‌ని అన్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు తదితర పాల్గొన్నారు.

About Author