NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ ప్రజలపై బాదుడే బాదుడు..టిడిపి భవిష్యత్తుకు గ్యారంటీ

1 min read

-బటన్లు నొక్కడమే అభివృద్ధి జాడేది

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: రాష్ట్ర ప్రజలపై వైకాపా ప్రభుత్వం అన్ని విధాలుగా రేట్లను పెంచుతూ బాదుతూ ఉందని టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమం జరిగినది.గ్రామ టిడిపి నాయకులు పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామంలో ఉన్న ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మానిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. కుటుంబంలో ఎంత మంది మహిళలు ఉన్నా వారికి ప్రతి నెల 1500 రూపాయలు మరియు తదితర పథకాల గురించి ప్రజలకు వివరించారు.అదే విధంగా ప్రభుత్వం బటన్లు నొక్కడమే తప్పా అభివృద్ధి కనిపించడం లేదని మార్కెట్లో ఏ వస్తువు కొన్నా కూడా సామాన్య ప్రజలు జీవించలేని విధంగా రేట్లను విపరీతంగా పెంచేశారని వీటిని ప్రతి ఒక్కరూ గమనించాలని రాబోయే రోజుల్లో ప్రజలు టిడిపి పార్టీని ఆదరించాలని మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,కాత రమేష్ రెడ్డి అన్నారు.తర్వాత ప్రతి ఇంటికి టిడిపి మేనిఫెస్టో కరపత్రాలను వారు అందజేశారు.ఈ కార్యక్రమంలో భూపాల్ రెడ్డి,శ్రీనివాస రెడ్డి, మానపాటి వెంకటేశ్వర్లు,కురువ వెంకటేశ్వర్లు,శివకుమార్,ఎం వెంకటయ్య,రంగస్వామి,రాంమద్దిలేటి,దేవన్న,సంపంగి రవీంద్రబాబు,సుభాన్, లక్ష్మీనారాయణ, ఐటిడీపీ మండల కన్వీనర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author