NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌డ‌ప ‘పేలుడు’ ఘ‌ట‌న‌.. వైసీపీ నేత అరెస్ట్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌డ‌ప జిల్లా క‌ల‌స‌పాడు మండ‌లం మామిళ్లప‌ల్లె ముగ్గురాయి గ‌నుల్లో జ‌రిగిన పేలుళ్ల ఘ‌ట‌న‌లో వైసీపీ నేత నాగేశ్వర్ రెడ్డి, పేలుడు ప‌దార్థాల కాంట్రాక్టర్ ర‌ఘునాథ‌రెడ్డిని అరెస్టు చేశారు. ఈ మేర‌కు జిల్లా ఎస్సీ అన్బురాజ‌న్ ప్రక‌ట‌న చేశారు. ఈనెల 8న ముగ్గురాయి గ‌నుల్లో జ‌రిగిన పేలుళ్ల‌లో 10 మంది మృతి చెందారు. వైసీపీ నేత నాగేశ్వర్ రెడ్డి ఈ గ‌ని లీజుకు తీసుకుని నిర్వహిస్తున్నారు. ఈ గ‌నికి ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు లేవు. పేలుళ్లు జ‌ర‌ప‌కూడ‌దు. దీని మీద వాస్త‌వ లీజుదారుల‌ను పిలిపించి.. విచారిస్తామ‌ని ఎస్సీ అన్బురాజ‌న్ తెలిపారు. పేలుడు ప‌దార్థాల కాంట్రాక్టర్ ర‌ఘునాథ్ రెడ్డికి లైసెన్స్ ఉన్నా.. వాటిని ర‌వాణ చేసే విష‌యంలో జాగ్రత్తలు తీసుకోక‌పోవ‌డం మీద విచార‌ణ చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

About Author