వైసీపీ నేత పై సొంత పార్టీ నేతలే దాడి !
1 min readపల్లెవెలుగువెబ్: అధికార పార్టీ వైసీపీలో విభేదాలు మరోమారు భగ్గుమన్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ ఆదిలక్ష్మీ భర్త రమణయ్యపై సొంత పార్టీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం కావలియడవల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న రమణయ్యపై అదే పార్టీకి చెందిన కొందరు కత్తులు, కర్రలతో దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రమణయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను హుటాహుటీన నెల్లూరులోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణకు దారి తీసిన కారణాలు తెలియ రాలేదు.