వైసీపీ నేతపై సొంతపార్టీ నేతలే దాడి !
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రకాశం జిల్లాలో ఓ వైసీపీ నేత పై మరికొందరు వైసీపీ నేతలు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొడాలి నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ వల్ల పార్టీకి నష్టమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని శ్రీనివాస్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. తన వ్యాఖ్యలు కలకలం రేపడంతో ప్రాణభయంతో ఓ లాడ్జిలో తలదాచుకున్న సుబ్బారావుపై బాలినేని అనుచరుడు సుభానీ తన గ్యాంగ్‌తో పాటు వెళ్లి దాడి చేశాడు. మంత్రి బాలినేనికి క్షమాపణ చెప్పాలంటూ మోకాళ్లపై కూర్చోబెట్టి వీడియో తీశారు. గుప్తాపై సుభానీ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సొంత పార్టీ నేతపై మంత్రి అనుచరులు దాడి చేయడం సంచలనంగా మారింది. సొంత పార్టీ వారిపైనే దాడి చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.