వైసీపీ నేత రాజీనామా
1 min read
పల్లెవెలుగువెబ్: విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని గెడ్డపువలస గ్రామ సర్పంచ్ గా ఉన్న వైసీపీ నేత తుమ్మగంటి సూరి నాయుడు వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. జగన్ వైసీపీని స్థాపించిన నాటి నుంచి పార్టీలో కొనసాగుతున్నానని, పాదయాత్రలో జగన్‌తో కలిసి నడిచానని ఆయన తెలిపారు. అయినా తనకు పార్టీలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసిన సూరి నాయుడు… నాడు పార్టీని, పార్టీ అదినేత కుటుంబ సభ్యులను దూషించిన వారికే అందలం దక్కిందని ఆరోపించారు.