PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ నాయకులు సొంత పార్టీ ఎమ్మెల్యేను గౌరవించడం నేర్చుకోండి

1 min read

– శాప్ చైర్మన్ ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం సిగ్గుచేటు.

– దళితులను కించపరిచే మీ వైసీపీకి కావాలి జాకీలు.

– బోర్ కు వచ్చింది వైసీపీ పార్టీనే..

– 2024 ఎన్నికల్లో మహిళలే జగన్ ను ఫట్ ఫట్ మని వాయిస్తారు.

– దళిత ఎమ్మెల్యే లకు వైసీపీలో గౌరవం లేదు.

– నందికొట్కూరు అభివృద్ధి పై చర్చకు వైసిపి సిద్దామా..

– దమ్ముంటే నందికొట్కూరు అభివృద్ధి పై శ్వేతపత్రం విడుదల చేయండి..

– టీడీపీ హయంలోనే అభివృద్ధి.. వైసీపీలో అభివృద్ధి శూన్యం.

– ఎస్సి సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గిత్త జయసూర్య.

పల్లెవెలుగు వెబ్​ నందికొట్కూరు:  రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రతిపక్ష పార్టీలను విమర్శించే ముందు సొంత పార్టీ దళిత ఎమ్మెల్యేను గౌరవించడం నేర్చుకోవాలని రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గిత్త జయసూర్య హితవు పలికారు. ఆదివారం పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం జరిగిన రాష్ట్ర మంత్రి రోజా  పర్యటనలో భాగంగా శాప్ చైర్మన్  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రతిపక్ష పార్టీలకు జాకీలు పెట్టి లేపిన లేవడం లేదనడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్ష పార్టీలను విమర్శించే ముందు సొంత పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేను గౌరవించడం నేర్చుకో అని హితవు పలికారు. నియోజకవర్గ అభివృద్ధి పై మాట్లాడే సిద్దార్థ రెడ్డి  నీ సొంత గ్రామమైన ముచ్చుమరి పక్కలోనే రూ.  360 కోట్లతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి సాగునీరు అందించిన ఘనత టిడిపి దే అని గుర్తించుకోవాలన్నారు. నియోజకవర్గంలో రైతులకు సాగు తాగునీరు మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా రెండు పంపులతో  కేసి కాలువకునీటిని అందించిన ఘనత మాండ్ర శివానందరెడ్డి కే దక్కుతుందన్నారు. నియోజకవర్గం లో గ్రామీణ ప్రాంతాలైన    వీపనగండ్ల ,ముచ్చుమర్రి ,సుంకేసుల, జలకనూరు, నెహ్రు నగర్, పాతకోట, పగిడ్యాల  తదితర గ్రామాలకు కృష్ణపుష్కరాల సందర్భంగా వేసిన బిపి రోడ్లు కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల క్రింద నందికొట్కూరు పట్టణంలోని మారుతి నగర్, ఏబీఎం పాలెం, సిఎస్ఐ పాలెం లో వాడవాడలా చంద్రన్న బాట పథకం కిందవేసిన సీసీ రోడ్లే టిడిపి చేసిన అభివృద్ధికి నిదర్శనం అన్నారు. వైసిపి నాలుగేళ్ల పాలనలో నియోజకవర్గంలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయిలో శాప్ చైర్మన్ గా ఉన్న మీరు కేవలం రెండు ఇండోర్ స్టేడియలు సాధించడంతో అభివృద్ధి అనుకుంటే పొరపాటు అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయిన 2009, 2014ఎన్నికల్లో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన లబ్బి వెంకటస్వామి, వై . ఐజయ్య లను గెలిపించి వారి అధికారాలను వారే అనుభవించే విధంగా సహకరించిన ఘనత గౌరు, మాండ్రలకే దక్కుతుందన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ఐజయ్య ను గత సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో పాల్గొనే ప్రతి అభివృద్ధి బహిరంగ సభలకుగౌరవంగా ఆహ్వానించడం జరిగిందన్నారు. వైసీపీ పార్టీలో అత్యధిక మెజార్టీతో గెలిచిన మీ ఎమ్మెల్యే ఆర్థర్ ను ఇప్పటికీ రెండుసార్లు మంత్రులు పాల్గొన్న ప్రారంభోత్సవాలకు ఆహ్వానించకపోవడం ఎంతవరకు సమంజసమో మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఏ పార్టీకి జాకీలు పెట్టి లేపవలసిన అవసరం వచ్చిందో ఇటీవల జరిగిన మూడు  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఎలాంటి  తీర్పు ఇచ్చారో గుర్తు పెట్టుకోవాలన్నారు   .  నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి జాకీలు పెట్టేందుకు అప్పట్లో ఇన్చార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను , ప్రస్తుత మంత్రి రోజాను తీసుకొని వచ్చి లేపవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందోనని   ప్రశ్నించారు.  సమావేశంలో పగిడ్యాల  మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి, నందికొట్కూరు మండల క్లస్టర్ ఇంచార్జ్ పల్లె రఘురామిరెడ్డి, టిడిపి మైనార్టీ నాయకులు షకీల్, లీగల్ సెల్ నాయకులు జాకీర్, ఐ టీడీపీ నాయకులు మాజీ కౌన్సిలర్ మూర్తుజావలి, నెహ్రూ నగర్ నాగరాజు, ఎస్సీ సెల్ నాయకులు సురేష్ తెలుగు యువత నాయకులు మధు, గణపురం చంద్రేష్, రవికుమార్, అల్లూరు పాల బాబులు, తదితరులు పాల్గొన్నారు.

About Author