లగడపాటి రాజగోపాల్ తో వైసీపీ నేతల సమావేశం
1 min read
పల్లెవెలుగువెబ్ : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సమావేశమయ్యారు. అనంతరం మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు ఇంటికెళ్లిన లగడపాటి వసంత నాగేశ్వరరావుతో 15 నిమిషాలపాటు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. లగడపాటి రాజగోపాల్ భేటీలపై రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ భేటీల్లో ఎలాంటి రాజకీయ కోణం లేదని రాజగోపాల్ చెబుతున్నారు. మర్యాద పూర్వకంగానే నేతలను కలిశానని లగడపాటి తెలిపారు.