వైసీపీకి ఎమ్మెల్యే అభ్యర్థి రాజీనామా
1 min readపల్లెవెలుగువెబ్ : వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండుసార్లు బొంతు పోటీచేశారు. కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు పదవికి బొంతు రాజీనామా చేశారు. ’రాజోలు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపైనే దాడులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితి చూడలేక పార్టీకి రాజీనామా చేస్తున్నా..’’ అని బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు వైసీపీ ప్రాధాన్యం ఇవ్వడంపై బొంతు వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు.