NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చంద్ర‌బాబును అభినందించిన వైసీపీ ఎమ్మెల్యే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబును వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి అభినందించారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో భాగంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి మేకపాటి విక్రమ్‌రెడ్డి విజయం కోసం ప్రసన్న సంగం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జంగాలకండ్రికలో జరిగిన బహిరంగసభలో చైతన్యరథంపై నుంచి ప్రసన్న ప్రసంగిస్తూ ‘ఒక విధంగా టీడీపీ వారిని మనం అభినందించాలి. ఎవరైనా ఎమ్మెల్యేగా ఉండి చనిపోతే.. ఆ కుటుంబంలో ఎవరైనా పోటీచేస్తే మేము పోటీ పెట్టమని చెప్పి నిర్ణయం తీసుకున్న చంద్రబాబును అభినందిస్తున్నాను. ఆ జ్ఞానం బీజేపీ వాళ్లకు లేకుండా పోయింది. గౌతమ్‌రెడ్డి చనిపోయిన తరువాత విలేకరుల సమావేశాలు పెట్టి పొగిడారు. చాలామంచివాడు, మనసున్న మంచి మహారాజు, అందరినీ దగ్గరకు తీసుకుంటారని పొగిడిన బీజేపీవారే.. ఇక్కడ పోటీ పెట్టడం దారుణం, దురదృష్టకరం’ అని ప్రసన్న అన్నారు.

                                      

About Author