వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా
1 min readపల్లెవెలుగువెబ్ : అమరావతే ఏపీ రాజధానిగా ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్ర నేపథ్యంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రైతుల పాదయాత్రకు పోటీగా వైసీపీ శ్రేణులు ర్యాలీలను నిర్వహిస్తున్నాయి. విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీ కూడా ఏర్పాటయింది. ఈ జేఏసీ సమావేశం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ కు అందించారు. ఉత్తరాంధ్ర వ్యతిరేకులను రాజకీయంగా బహిష్కరించాలని చెప్పారు. అధికార వికేంద్రీకరణ కోసం తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు.