డ్రైవర్ ను ఎందుకు హత్య చేశాడో చెప్పిన వైసీపీ ఎమ్మెల్సీ !
1 min readపల్లెవెలుగువెబ్ : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీని పోలీసులు విచారిస్తున్నారు. దీంతో తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఉదయ్ భాస్కర్ అంగీకరించారు. తానొక్కిడినే డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు ఎమ్మెల్సీ పోలీసులకు తెలియజేశారు. అయితే ఎందుకు… ఎలా హత్య చేశాడో పూర్తి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంటికొచ్చి డ్రైవర్‌ను తీసుకెళ్లిన దగ్గర నుంచి హత్య చేసి ఇంటికి మృతదేహాన్ని తరలించినంత వరకు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. మృతుడి భార్య, తల్లిదండ్రుల ఆరోపణలపై ఎమ్మెల్సీని లోతుగా ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన స్థలానికి తీసుకెళ్లకుండా ప్రాథమికంగా వివరాల సేకరిస్తున్నారు. కాగా… పోలీసులు ఇప్పటి వరకు ఉదయ్‌భాస్కర్ అరెస్ట్‌ను చేపించలేదు. మరోవైపు ఈ రోజు సాయంత్ర ఉదయ్ భాస్కర్‌ను పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించనున్నారు. రిమాండ్ కోసం ఫిట్‌గా ఉన్నాడో లేదో వైద్యులు పరీక్షించనున్నారు.