మహిళతో వైసీపీ ఎంపీ నగ్న వీడియో కాల్ !
1 min readపల్లెవెలుగువెబ్ : హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో మాధవ్ నగ్నంగా వీడియోకాల్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆయన తీరుపై మండిపడుతున్నారు. ఎంపీగా ఉంటూ మహిళతో నగ్నంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల ఎంపీగా ఉంటూ ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజల సమస్యలపై పరిష్కరించాల్సిన ఎంపీ.. మహిళతో రాసలీలలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆయన మాట్లాడిన మహిళ ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. మాధవ్ తీరుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు.