NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ  పతనం తప్పదు..

1 min read

–నంద్యాల టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి..

పల్లెవెలుగు వెబ్ కల్లూరు:  రాష్ట్రంలో వైసిపి పాలనకు మైనస్ మార్కులు పడ్డాయని ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం యువ నాయకుడు టిడిపి పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు నారా లోకేష్ యువ  గళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైసిపి పాలనపై ప్రజలు విసిగిపోయారని ధరలు అవినీతి ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా అన్ని ప్రభుత్వ ఆధ్వరంలో నడవడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఈ నాలుగేళ్ల పాలనలో కనీసం రోడ్డుపై గుంతలు పూడ్చలేకపోయారని ఏద్దేవ చేశారు లోకేష్ యువ గళం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నంద్యాల పార్లమెంట్ టిడిపి జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ శాసనసభ సభ్యురాలు గౌరు చరితా రెడ్డి ఆధ్వర్యంలో పందిపాడు నుండి చెన్నమ్మ సర్కిల్ వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున టిడిపి నాయకులు కార్యకర్తలు గడివేముల మండల టిడిపి కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author