వైసీపీ రాజ్యసభ సీటు.. చిరంజీవి స్పందన !
1 min read
పల్లెవెలుగువెబ్ : రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటు ఇస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తాను పదవులకు లోబడే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు అవాస్తవమేనని ఆయన తెలిపారు. అలాంటి వార్తలను ఖండిస్తున్నట్టు ఆయన తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని, వాటిని తాను కోరుకోనని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా డోకిపర్రులోని ప్రముఖ పారిశ్రామిక వేత్త మెగా కృష్ణారెడ్డి ఇంటికి సంక్రాంతి వేడుకలకు చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.