వైసీపీ శ్రేణులు సంబరాలు…
1 min readవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 వసంతాలు పూర్తిచేసుకుని 14వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకుని. 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్బంగా ఎమ్మిగనూరు శిల్పా ఎస్టేట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర వైఎస్సార్సీపీ జెండా ను ఆవిష్కరించిన ఎమ్మిగనూరు సమన్వయకర్త శ్రీమతి “బుట్టా రేణుక , నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి , అనంతరం వైయస్సార్ సర్కిల్ నందు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తరువాత పార్టీ శ్రేణులతో కలసి కేక్ కాట్ చేశారు.ఈ సందర్భంగా శ్రీమతి బుట్టా రేణుక, ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి లు మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎన్నో సవాళ్లను అధిగమించి, సంపూర్ణ ప్రజా బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు అమలు చేయడమే కాక, చెప్పని వాటితో పాటు, అనేక సంక్షేమ – అభివృద్ధి కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారంజక పరిపాలన సాగిస్తోంది.ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రతి ఇంటా విద్య, ఆర్థిక, సామాజిక విప్లవాత్మక మార్పులతో జగనన్న నాయకత్వంలో మన లక్ష్యాలు సాకారం చేసుకుంటున్న వేళ… మనం సాధించిన ప్రగతి, విజయాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్న తరుణంలో తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులును ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు ఇచ్చి.. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే ఇచ్చి.. హోంశాఖ మంత్రిగా తొలిసారిగా ఎస్సీ మహిళను నియమించి సామాజిక విప్లవానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. 2022 ఏప్రిల్ 11వ పునర్ వ్యవస్థీకరణ ద్వారా మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఆ వర్గాల వారికి ఇచ్చి, సామాజిక సాధికారత సాధనలో దేశానికి రోల్ మోడల్ గా నిలచారు. అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే 98 శాతానికి పైగా హామీలను అమలు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వెన్నుదన్నుగా నిలచారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. ఎన్నో పథకాల ద్వారా పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు అండగా నిలిచారు. జనరంజక పాలన అందిస్తూండటంతో ప్రజలు పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్, ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులు, అభ్యర్థులను గెలిపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మండల కన్వీనర్ బి ఆర్ బసిరెడ్డి , బుట్టా శివనీలకంఠ , పార్టీ శ్రేణులు, మున్సిపల్, టౌన్ బ్యాంకు చైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, పట్టణ అధ్యక్షులు,కమిటీ సభ్యులు,కౌన్సిలర్లు, ఇన్ చార్జ్ లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.