PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి ఇక లేరు..

1 min read

-జన సంద్రంగా మారిన అంతిమయాత్ర .. -నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అనుచరుడు మచ్చలేని నాయకుడు మంచికి మారు పేరుగా పేరు పొందిన కైపా శ్రీధర్ రెడ్డి(54)ఇక లేరు.ఈయన పిల్లలను పెద్దలను ప్రతి ఒక్కరినీ కూడా మంచిగా పలకరిస్తూ అంతేకాకుండా మండలంలో నియోజకవర్గంలో కూడా రాజకీయ పరంగా గుర్తింపు పొందార నడంలో చెప్పనవసరం లేదు.ఈయన తండ్రి కైపా చంద్ర పుల్లారెడ్డి గతంలో గ్రామ సర్పంచ్ గా ఉంటూ ప్రజలకు వెన్ను దన్నుగా ఉన్న కుటుంబం. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఈనెల 7వ తేదీన 11 గంటల సమయంలో దిగువపాడు-గార్గేయపురం మధ్యలో ఉన్న హంద్రీ నీవా కాలువ దగ్గర కాలు జారి కాలువలో పడ్డాడు.తెలుసుకున్న కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు కాలువ వెంట వెళ్తూ గాలింపు చేపట్టారు.చివరకు నిన్న ఉదయం వెల్దుర్తి మండలం మల్లెపల్లె దగ్గర కాలువలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి వైద్యులు పంచనామా చేశారు.తర్వాత నిన్న మధ్యాహ్నం మృతదేహాన్ని గ్రామానికి తీసుకు వచ్చారు.మాజీ ఎమ్మెల్యేలు ఐజయ్య,లబ్బి వెంకటస్వామి,వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ధార సుధీర్,నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి,మాజీ ఏఎంసీ చైర్మన్ చిన్న మల్లారెడ్డి,వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి,టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి గిత్త జయసూర్య,టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి తదితర ప్రజా ప్రతినిధులు నాయకులు ఆయన నివాసానికి చేరుకుని ఆయన మృతి దేహానికి పూలమాలలు వేస్తూ ఘనంగా నివాళులు అర్పించారు.అంతే కాకుండా కుటుంబ సభ్యులకు వారు ఓదార్పునిచ్చారు.శ్రీధర్ రెడ్డి మరణ వార్త ప్రతి ఒక్కరిలో కలచి వేసిందని అంతేకాకుండా ఆయన పార్టీలో చాలా చురుకుగా ఉంటూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారని ఆయన లేని లోటు పార్టీకి తీరని నష్టం వాటిల్లిందని నాయకులు అన్నారు.సాయంత్రం గ్రామంలో అంత్యక్రియల్లో గ్రామంలో జన సంద్రంగా మారింది.శ్రీధర్ రెడ్డి మృతి చెందడం కుటుంబ సభ్యుల్లో మరియు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.ముందుగా బుధవారం జరిగిన సంఘటన స్థలికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేరుకుని కుటుంబ సభ్యులతో అధికారులతో ఆయన మాట్లాడారు.ఈయనకు భార్య శారదమ్మ,కుమారుడు లక్ష్మీ ప్రసన్న కుమార్ రెడ్డి ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. కూతురుకు గత సంవత్సరం వివాహం చేశారు.

About Author