NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

175 కు 175 సీట్లు వైసిపి గెలవాలి..

1 min read

– మిలాదున్ నబి పండుగ సందర్బంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు
పల్లెవెలుగు వెబ్​ ,అన్నమయ్య జిల్లా రాయచోటి: అల్లా దీవెనల తో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని వైసిపి మైనార్టీ నేత బెపారి మహ్మద్ ఖాన్ అన్నారు. సోమవారం పట్టణంలోని పాతారాయచోటి సమీపంలో మిళాదున్ నబి పండుగ సందర్బంగా హాజరత్ జామలుల్లా బాషా దర్గాలో స్థానిక మైనార్టీ నేతలు,కార్యకర్తలతో కలిసి దర్గా గురువులు (మురిషీద్)లు తో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బెపారి మహమ్మద్ ఖాన్.ఈ సందర్బంగా బెపారి మహ్మద్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోసం 2024 ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కావాలన్నారు.అలాగే ఎంపీ మిథున్ రెడీ,ఎమ్మెల్యే గడికోటశ్రీకాంత్ రెడ్డి లు తిరిగి గెలుపొందలని తామందరము ప్రార్థనలు చేసినట్లు చెప్పారు.అలాగే రాష్ట్ర శ్రేయస్సు అభివృద్ధి కొరకు మూడు రాజధానులు కూడా కావాలని ప్రార్థనలు జరిపమన్నారు.ప్రజలందరు సమైక్యత భావంతో ఆనందంగా జీవితం గడపాలని తాము కోరుకొన్నామన్నారు.వర్షాలు సంవృద్దిగా కురిసి పంటలు బాగా పండి రైతులు,ప్రజలు సుఖ సంతోషాలతో నిండుగా ఉండాలని ఆకాక్షించమన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, కౌన్సిలర్ అన్నా సలీం, గౌస్ ఖాన్, వైసిపి నాయకులు అజ్మతుల్లా, జబీబుల్లా ఖాన్,ఫైరోజ్ ఖాన్ లు తదితరులు పాల్గొన్నారు.

About Author