NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిడుతూరు వార్డు ఎన్నికల్లో వైసీపీ టిడిపి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలంలో రెండు గ్రామాలలో జరిగిన వార్డు ఎన్నికలు మొరా మోరీగా జరిగాయి.పైపాలెం గ్రామంలో వైసీపీ అభ్యర్థి గెలుపొందగా అలగనూరు గ్రామంలో టిడిపి అభ్యర్థి అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందారు.శనివారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు జరిగాయి తదనంతరం మధ్యాహ్నం వార్డు ఎన్నికల ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు.పైపాలెంలో 5వ వార్డుకు మొత్తం 80 ఓట్లు ఉండగా అధికార పార్టీ అభ్యర్థి బి.బాలసుబ్బన్న 43 ఓట్లు పోలయ్యాయి.టిడిపి అభ్యర్థి పి క్కిలి లక్ష్మీదేవికి 35 ఓట్లు పడగా ఈమెపై అత్యంత ఉత్కంఠత నడుమ బాల సుబ్బన్న ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. తర్వాత అలగనూరులో పదవ వార్డుకు మొత్తం 143 ఓట్లు ఉండగా 103 ఓట్లు పోలయ్యాయి.టిడిపి అభ్యర్థి పోలగళ్ల శేషమ్మకు-78 ఓట్లు పోలవగా అధికార పార్టీ నుండి తాటిపాటి సుధాకర్ కు-21ఓట్లు పడ్డాయి. ఈయనపై పోలగళ్ల శేషమ్మ 57 ఓట్ల అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందారు.

About Author