NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీజేపీ అభ్య‌ర్థికి వైసీపీ బేష‌ర‌తు మ‌ద్దతు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో వైసీపీ బేషరతుగా ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు పలికింది. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్న పార్టీగా వైసీపీ ఆమెకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి ఢిల్లీ రావాలని బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలందరినీ బీజేపీ నాయకత్వం ఆదేశించింది. ఎన్‌డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హాజరయ్యే అవకాశముంది. వీరితోపాటు తాను కూడా వెళ్లాలని జగన్‌ భావించారు. కానీ ఆయన స్థానంలో వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి.. ద్రౌపది నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారని తెలిపింది.

                                      

About Author