NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం తప్పదు…

1 min read

మళ్లీ చంద్రబాబు పాలనను ప్రజలు కోరుకుంటున్నారు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెబుతారని మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలనను రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్  సెక్రటరీ గిత్త జయసూర్య అన్నారు.నందికొట్కూరు పట్టణం  8వ వార్డులో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం  ఇంటింటి ప్రచారం నిర్వహించి చంద్రబాబు నాయుడు  ప్రకటించిన మినీ మానిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ  సంక్షేమంలో కోతలు విధించి పేద ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పతనం తప్పదని అన్నారు. టీడీపీతోనే రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమని వివరించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. కార్యక్రమంలో , జాకీర్ హుస్సేన్, నాగముని, ముర్తుజావాలి, జమీల్, రసూల్, బాబుసాహెబ్, బాబుల్, రాజన్న, కళాకార్, ప్రవీణ్, నంద్యాల పార్లమెంట్ తెలుగు యువత నాయకులు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

About Author