పుర పోరులో వైసీపీ హవా..
1 min readజగన్ పాలనను మరోసారి ఆదరించిన ప్రజలు
పల్లెవెలుగు వెబ్, కడప బ్యూరో: కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ జెండా రెపరెపలాడింది. కడప కార్పొరేషన్‌తోపాటు మైదుకూరు, ప్రొద్దుటూరు, రాయచోటి, ఎర్రగుంట్ల, పులివెందుల, బద్వేల్ మున్సిపాలిటీలు, జమ్మలమడుగు నగర పంచాయతీలో ఎన్నికలు ఈ నెల 10న జరిగింది. 14వ తేదీ ఆదివారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను కొనసాగించగా.. కడప,మైదుగురు, బద్వేల్, ప్రొద్దుకూరు, జమ్మలమడుగు నగర పంచాయతీలో వైసీపీ జెండా ఎగిరింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సుపరిపాలనను మరోసారి ప్రజలు ఆదరించినట్లు స్పష్టమయ్యింది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా… ప్రజలు తమ వైపు ఉన్నారని వైసీపీ శ్రేణులు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు.
కడప : కడప పట్టణంలో మొత్తం 50 వార్డులకు గాను 24 వార్డులు ఏకగ్రీవం కాగా మిగతా 26 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అందులో 20 వార్డులకు గాను 86429 ఓట్లు నమోదు కాగా అందులో 53 408 ఓట్లను అనగా 61.79℅ శాతం ఓట్లు లెక్కించడం జరిగింది. 26 వార్డులకు గాను వైసిపి 24 టిడిపి 1 స్వతంత్ర అభ్యర్థి 1 గెలుపొంది వైసీపీ కడప కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది.
ప్రొద్దుటూరు: పొద్దుటూరు మున్సిపాలిటీ లో మొత్తం 40 వార్డులకు గాను వైసిపి వారికి 9 ఏకగ్రీవాలు మిగిలిన వార్డులకు జరిగిన ఎన్నికలలో 4 స్థానాలలో టిడిపి గెలవగా మిగిలిన స్థానాలలో వైసిపి గెలుపొంది పొద్దుటూరు మున్సిపాలిటీ కైవసం చేసుకుంది.
మైదుకూరు: మైదుకూరు లోని మొత్తం 23 వార్డులో ఏ ఒక్క వార్డులో కూడా ఏకగ్రీవాలు జరగకపోవడంతో అన్ని వార్డులలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో 12 వార్డులలో టిడిపి గెలుపొందగా 11 వార్డులలో వైసిపి జనసేన 1 వార్డు గెలుపొందారు. మైదుకూరులో క్యాంపు రాజకీయాలు తెరలేపారు. జనసేన పార్టీ మద్దతు కూడగట్టేందుకు వైసిపి టిడిపి పార్టీలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి. జనసేన అభ్యర్థి ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు
బద్వేల్: బద్వేల్ మున్సిపాలిటీని వైసిపి కైవసం చేసుకుంది. మొత్తం 35 వార్డులలో వైసిపి పార్టీకి 10 ఏకగ్రీవాలు కాగా మిగిలిన వార్డులకు జరిగిన ఎన్నికలలో వైసిపి 11 టిడిపి 2 వార్డులు గెలుచుకోగా స్వతంత్ర అభ్యర్థులు 4 వార్డులలో గెలుపొందారు
రాయచోటి: రాయచోటి మునిసిపాలిటీ లో మొత్తం 34 వార్డులకు గాను 31 వార్డులో వైసిపి వారికి ఏకగ్రీవం కాగా మిగిలిన 23,24,25 వార్డులలో జరిగిన ఎన్నికలలో కూడా వైసిపి విజయం సాధించి రాయచోటి మున్సిపాలిటీ మొత్తం క్లీన్ చేసి మునిసిపాలిటీని కైవసం చేసుకుంది
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మునిసిపాలిటీ లో మొత్తం 20 వార్డులకు గాను 13 వార్డులు వైసిపి వారికి ఏకగ్రీవాలు కాగా మిగిలిన 7 వార్డుల్లో జరిగిన ఎన్నికలలో వైసిపి విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసి ఎర్రగుంట్ల మున్సిపాలిటీ ని కైవసం చేసుకుంది.
జమ్మలమడుగు: జమ్మలమడుగు మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులకు గాను 16 చోట్ల వైసిపి రెండు వార్డులలో బిజెపి గెలుపొంది జమ్మలమడుగు మునిసిపాలిటీని వైసిపి కైవసం చేసుకుంది.
పులివెందుల: పులివెందుల మున్సిపాలిటీ లో మున్సిపాలిటీ మొత్తం ఏకగ్రీవం కావడంతో వైసిపి పులివెందుల మున్సిపాలిటీ ని కైవసం చేసుకుంది.