2024లో వైసీపీ గెలుపు పక్కా..
1 min readమున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి.
సీఎం జగనన్న అవడం ఖాయం.
వైయస్ జగన్ తోనే సామాజిక సాధికారిత.
సామాజిక విప్లవానికి చిరునామా వైసీపీ ప్రభుత్వం.
చెప్పింది చేసిన ఘనత సీఎం జగనన్నకే సాధ్యం.
అట్టడుగు వర్గాలకు వైసీపీ ప్రభుత్వంలో పెద్దపీట.
సంక్షేమ పథకాలతో ఆర్థిక సాధికారత..
ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే పై సమీక్ష.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: తండ్రి ఒక అడుగు వేస్తే తనయుడు రెండు అడుగులు వేసి గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని రాష్ట్రంలో సాకారం చేసి చూపించారన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగాలంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకోవాలని మున్సిపల్ చైర్మన్ దాసీ సుధాకర్ రెడ్డి కోరారు.శనివారంనందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని జై కిసాన్ పార్కు నందు జెసియస్ కన్వీనర్ అబూబక్కర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి , నందికొట్కూరు ఎంపీపీ మురళీకృష్ణ రెడ్డి , పట్టణ అధ్యక్షుడు మన్సూర్ , నియోజకవర్గ జె సి ఎస్ కన్వీనర్ రవి యాదవ్ , మండల జె సి ఎస్ కన్వీనర్ ఓంకార్ రెడ్డి , వైసీపీ నాయకులు జబ్బార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐ ఫ్యాక్ టీం ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలంటే కార్యక్రమం పై సచివాలయ కన్వీనర్లు, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ముందుకు వెళ్లి జగనన్న చేసిన సంక్షేమ అభివృద్ధిని వారికి వివరించాలని అన్నారు.వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం చేస్తున్న అభివృద్ధి దేశంలో ఇంకెక్కడ లేదన్నారు. జగనన్న ను మళ్లీ సీఎంగా చేసుకునేందుకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాయకత్వంలో అందరమూ కలిసి పార్టీ కోసం పని చేద్దామన్నారు. ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ జగనన్న ప్రభుత్వంలో విద్యకు మరియు వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని మళ్లీ జగనన్నే రావాలి* అనే నినాదంతో ముందుకు వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు చింతా విజ్జి, పట్టణ పరిశీలకులు బద్దుల శ్రీకాంత్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ లు ఉస్మాన్ బేగ్, సులోచనమ్మ, ఉప సర్పంచ్ సురేష్ యాదవ్., కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ గఫార్, కౌన్సిలర్లు హమీద్, చాంద్ భాష, అబ్దుల్ రవూఫ్, కాటెపోగు చిన్న రాజు, లాలూ ప్రసాద్, షేక్ నాయబ్, చెరుకు సురేష్, మందడి రవీంద్రారెడ్డి, రజిని కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, బోయ శేఖర్, మార్కెట్ రాజు, శాలి భాష, బ్రహ్మయ్య ఆచారి, కురువ శ్రీను , శాతనకోట సర్పంచ్ జనార్ధన్, వైయస్సార్సీపి సోషల్ మీడియా నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆశన్న మధు, సచివాలయ కన్వీనర్లు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.