PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రేమికుడి ఇంట్లో ప‌దేళ్లుగా.. ల‌వ‌ర్ ఫ్యామిలీకి కూడ‌ తెలియదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: కేర‌ళ‌లోని ఓ జంట వింత ప్రేమ క‌థ ఇది. పాల‌క్కాడ్ జిల్లా అయిరూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 2010 ఫిబ్రవరిలో ఓ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. గ‌త ప‌దేళ్లుగా ఆమె ఎక్కడుందో తెలియ‌దు. సీన్ క‌ట్ చేస్తే.. అయిరూర్ గ్రామ స‌మీపంలో ఓ అబ్బాయి కూడ అదృశ్యం అయ్యాడు. దీంతో క‌థ పోలీస్ స్టేష‌న్ కి చేరింది. విచార‌ణ చేసిన పోలీసుల‌కు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆ అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ప్రేమికులు. ప‌దేళ్లుగా ఆ అమ్మాయి.. ఆమె ప్రేమికుడి ఇంట్లోనే ఉంది. అది కూడ ఒకే గ‌దిలో. ఆ గ‌దికి క‌నీసం బాత్ రూం కూడ లేదు. రాత్రి పూట ఆమె కాల‌కృత్యాలు తీర్చుకునేది. ఆహారం, నీరు ఆమె ప్రేమికుడు ప్రతిరోజు స‌ర‌ఫ‌రా చేసి.. త‌ర్వాత ఆ గ‌దికి తాళం వేసేవాడు. ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే.. ఆ అబ్బాయి ఇంట్లో వాళ్లకు కూడ ఆమె ప‌దేళ్లుగా త‌మ ఇంట్లో ఉన్న విష‌యం తెలియ‌దంట‌. వీరు అదృశ్యం అయిన త‌ర్వాత పోలీసులు విచార‌ణ జ‌రిపారు. వీరిద్దరు నెమ్మెర స‌మీపంలోని విథాన్ సెరి అనే కుగ్రామంలో అద్దెకు ఉంటున్నారు. వీరిని పోలీసులు న్యాయ‌మూర్తి ఎదుట హాజ‌రుప‌రిచారు. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నార‌ని.. క‌లిసి జీవించాల‌ని కోరుకుంటున్నట్టు కోర్టు ఎదుట తెల‌ప‌డంతో .. వీరిని క‌లిసి జీవించేందుకు అనుమ‌తి ఇచ్చారు.

About Author