యస్. జీ. యఫ్..పాఠశాల క్రీడా సమాఖ్య సెలెక్షన్స్
1 min readపల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె :నియోజవర్గంలో విద్యాశాఖ అధికారిణి శ్రీమతి అనురాధ మేడం గారి ఆదేశాల మేరకు బనగానపల్లి నియోజక వర్గ పరిధిలోని 05 మండలాల అండర్ – 17 మరియు అండర్ – 14 బాల,బాలికల కు 09 ఈవెంట్ లలో అనగా కబడ్డీ, ఖో- ఖో, వాలీబాల్, టెన్ని కాయిట్, బాల్ బ్యాడ్మింటన్, త్రోబాల్, షటిల్ బ్యాడ్మింటన్, యోగ ,అథ్లెటిక్స్ లలో సెలెక్షన్స్ ను నియోజక వర్గ స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందవరం నందు ఈ నెల 29 వ తేదీన అండర్-17 (బాల బాలికలకు) మరియు అండర్-14 (బాల బాలికలకు) నిర్వహిస్తున్నామని నియోజక వర్గ స్థాయి క్రీడా ఇంఛార్జి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ సెలెక్షన్స్ నిర్వహణ కొరకు నియోజక వర్గం లోని 05 మండలాల యస్. జీ. యఫ్ ఇంఛార్జి లతో ముందస్తు సంసిద్ధత సమావేశం ను బనగానపల్లె పట్టణంలోని స్థానిక మండల వనరుల కేంద్రం (యం.ఆర్.సీ) లో మండల విద్యా శాఖ అధికారిణి అధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారిణి శ్రీమతి P SWARUPA గారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని వ్యాయామ ఉపాధ్యాయులంతా సమిష్టిగా కృషిచేసి రెండు రోజుల పాటు జరిగే ఈ క్రీడలను విజయవంతం చేసి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ క్రీడలలో పాల్గొనబోయే విద్యార్థిని, విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తున్నారని తెలియజేశారు.కావున బనగానపల్లె నియోజక వర్గ పరిధిలోని అన్ని మండలాల ఇంఛార్జి లు తమ మండల జట్లతో సెలెక్షన్స్కు 29 వ తేదీ ఉదయం 09:00 గంటలకంతా సెలెక్షన్స్ కు zphs నందవరం కు తీసుకుని రావాలని మరియు ఎవరి క్రీడా సామాగ్రి వారే తెచ్చుకోవాలని పేర్కొన్నారు. క్రీడాకారుల రవాణా సౌకర్యం, బాధ్యత మరియు వారి క్రమశిక్షణను ఆయా పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులే దగ్గరుండి చూసుకోవాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో బనగానపల్లి మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులు మరియు కొలిమిగుండ్ల కోవెలకుంట్ల సంజామల అవుకు మండలాల ఇన్చార్జిలు మరియు ఒకరు సీనియర్ ఉపాధ్యాయులు హాజరు కావడం జరిగినది తదితరులు పాల్గొన్నారు.