మొన్న టీడీపీ.. నేడు వైసిపి
1 min read– నవ్వుల పాలవుతున్న కమలాపురం రాజకీయం
– జమ్మాపురంలో టిడిపి నుంచి వైసిపి లోకి వలసలు
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజక వర్గం కమలాపురం మండలం లో రాజకీయం నవ్వుల పాలవుతోంది మొన్న గాక మొన్న తెలుగు దేశం పార్టీ ఇంచార్జీ పుత్తా నరసింహ రెడ్డి ఆద్వర్యంలో జమ్మాపూరం పంచాయతీ లోని గొల్లపల్లి సలితిమ్మయ పల్లె గ్రామాల్లో వంద కుటుంబాలు వరకు వైసిపి నుంచి విడిపోయి తెలుగు దేశం పార్టీలో చేరారని తెలుగు దేశం పార్టీ నాయకులు ప్రకటించుకున్నారు. ఆమేరకు గొల్లపల్లి గ్రామంలో భారీ ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసి అందరికి పార్టీ కండువాలు కప్పి తెలుగు దేశం పార్టీ లోకి ఆహ్వానించారు. ఇది జరిగి ఐదు రోజులు గడవక ముందే మరలా గత శుక్రవారం తెలుగు దేశం పార్టీలో చేరిన అనేకమంది ని మంగళ వారం నాడు మండల జడ్ పి టి సి భర్త లింగాల రాజశేఖరరెడ్డి మండల కన్వీనర్ సుధా ఉత్తమా రెడ్డీ జమ్మాపురం గ్రామ పంచాయితీ సర్పంచ్ ఇంది రెడ్డి సోదరులు శ్రీనివాసుల రెడ్డి సుధాకర్ రెడ్డీ, గ్రామ వైసిపి నాయకులసమక్షం లో జమ్మాపురం, గ్రామ పంచాయితీ లో సమావేశం పెట్టీ వైసిపి లోకి చేర్చుకున్నారు శుక్రవారం నాడు తెలుగు దేశం పార్టీలోకి చేరిన వారిని వైసిపి పార్టీలో చేర్చుకోవడం తో కమలాపురం రాజకీయం రంజుగా ఉండడానికి బదులు నవ్వుల పాలుగా మారిందని కమలాపురం ప్రాంతంలో రాజకీయ ఆసక్తి ఉన్న వారు తీవ్రంగా చర్చించుకొంటున్నారు. “”మొన్న అటు మళ్లీ ఇటు మరి రేపు ఎటో” ఎంటో ఈ రాజకీయం అవగాహన లేని పరిపక్వత లేని వారి వల్లన నవ్వుల పాలవుతోంది.