యోగాసనం..ఆరోగ్యం…
1 min read
60 ఏళ్ల యువకుడు.. 20 ఏళ్ల యువతకు ఆదర్శం..
ఆసనాలతో కండరాలు, నరాలలో ఉత్తేజం..
గుండె.. కిడ్నీ, వెన్నెముక కు చక్కగా రక్త సరఫరా ..
కర్నూలు, న్యూస్ నేడు: సమాజంలో క్షణం తీరిక లేకుండా… పెద్దలు సంపాదనపై పడగా… యువత కంప్యూటర్, సెల్ ఫోన్లకు పరిమితమవుతున్నారు. దీనికి తోడు కొందరు దురలవాట్లకు దగ్గరయ్యారు. పాఠశాలల్లో మైదానం లేక పిల్లలు కూడా ఆటలకు దూరమవుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం దశల వారీగా క్షీణించడంతోపాటు ఆయుష్షు తక్కువయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రిటైర్డు ఉద్యోగి రామ్మోహన్ జీవనశైలి… యువతకు ఆదర్శంగా నిలుస్తుందనే చెప్పవచ్చు. ఉదయం 3 కి.మీ. నడక, మరో మూడు కి.మీ.లు మైదానంలో పరుగులు తీస్తారు. ఆ తరువాత గంట పాటు ఆసనాలు చేస్తాడు. పదాంగాసనం, పశ్చిమోత్తాసనం, బట్టర్ ఫ్లై ఆసనం, హలాసనం, చక్రాసనం, శీర్షాసనం, లిటరల్ స్పిల్ట్, భూనమాసనం , లెగ్ లిఫ్ట్ తదితర ఆసనాలు చేస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంతోపాటు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.