యోగా ప్రాచీన భారత జీవనశైలి..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: చిన్మయ మిషన్ కర్నూలు శాఖ ,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో వెంకరమణ కాలనీలో చిన్మయ ప్రభావలి లో యోగా పోటీలను నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు .ఈ సందర్భంగా చిన్మయ మిషన్ శిబిరాచార్యులు పూజ్య స్వామిని సుప్రమేనంద సరస్వతి మాట్లాడుతూ యోగా సాధన శరీరం మరియు మనసుల మధ్య సమతుల్యతను కలిగిస్తుందని రోజువారి యోగ సాధన వల్ల ఆరోగ్యంగా , శాంతియుతంగా జీవించవచ్చు అన్నారు .లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి మాజీ లయన్స్ జిల్లా ఎడిషన్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా సాధనవల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని, విద్యార్థులందరూ యోగాను జీవిత భాగంగా చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెంకట శెట్టి, శ్రీరంగం వెంకటేశ్వర్లు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.