మండల వ్యాప్తంగా జగనన్న మీరే మా భవిష్యత్
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జీయన్ భాస్కర్ రెడ్డి లు అన్నారు, శనివారం వారు కొత్త గాంధీ నగర్ లో జగనన్న మీరే మాభవిష్యత్, మీరే మా నమ్మకం కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందన్నారు, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో వారి అనునాయులకు తప్ప మిగతా వారికి ఎటువంటి లబ్ధి చేకూరాలేదని వారు తెలిపారు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కులాలు, మతాలు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అదే విధంగా చూడడం జరిగిందన్నారు, దీనికి సంబంధించి గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, వాలంటీర్ల ద్వారా ప్రతి 50 ఇండ్లకు సంబంధించి ఏ ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి వారికి ఆ సమస్య పరిష్కార దిశగా చూడడం జరిగిందన్నారు, ఇందులో ఎటువంటి అవకతవృత్తులకు ఆస్కారం లేకుండా చూడడం జరిగిందని వారు తెలియజేశారు, అంతేకాకుండా వైసిపి పాలనలో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని వారు తెలియజేశారు, అంతేకాకుండా మండల వ్యాప్తంగా వైఎస్ఆర్ సీపీ నాయకులు ఆధ్వర్యంలో రాచనాయపల్లి లో రాష్ట్ర కార్యదర్శి మాసిమా బాబు, సర్పంచ్ సొంటం నారాయణరెడ్డి ఆధ్వర్యంలో అదేవిధంగా శివాలపల్లెలో సర్పంచ్ ముమ్మిడి సుదర్శన్ రెడ్డి , మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్ ఆధ్వర్యంలో, జగనన్న మీరే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాసీమా బాబు మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించారు, దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని సంక్షేమ పాలనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగిందని ఆయన తెలియజేశారు, రానున్న స సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రికి మనమంతా అండగా నిలబడి ఆయనను మళ్లీ 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని వారు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మూడవ సెగ్మెంట్ ఎంపీటీసీ, పైడికల్వ పుష్పలత, జకరయ్య, చంద్ర, బాబు, భాస్కర్, రత్నం, టి ఎన్ చంద్ర రెడ్డి, పాలగిరి ఉమామహేశ్వర్ రెడ్డి, కటారి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.