ఇంట్లో కూర్చుని వీధులన్నీ చూడొచ్చు !
1 min readపల్లెవెలుగువెబ్ : గూగుల్ ‘స్ట్రీట్ వ్యూ’ ఫీచర్ భారత్ లో మళ్లీ అందుబాటులోకి వచ్చింది. ‘ప్రాజెక్ట్ గల్లీఫై’ పేరుతో గూగుల్ సంస్థ స్ట్రీట్ వ్యూ సేవలను బుధవారం బెంగళూరు లో ప్రారంభించింది. త్వరలో హైదరాబాద్, కోల్‌కతా, వడోదర, అహ్మద్‌నగర్, అమృత్‌సర్, చెన్నై, ఢిల్లీ, ముంబై, పుణె నగరాల్లో, ఈ ఏడాది చివరికల్లా 50 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. టెక్ మహీంద్రా, జెనెసిస్ ఇంటర్నేషనల్ సంస్థల భాగస్వామ్యంతో గూగుల్ సంస్థ స్ట్రీట్ వ్యూను భారత్‌లో ప్రవేశపెట్టింది. గూగుల్ మ్యాప్స్ వినియోగదారుల ప్రయాణాలను సులభం చేయడం, షాపింగ్‌లో కొత్త ఒరవడిని తేవడంలో స్ట్రీట్ వ్యూ దోహదం చేస్తుందని సంస్థ పేర్కొంది.