PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తాయిలాలతో ఉపాధ్యాయులను, పట్టభద్రులను కొనలేరు

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఉపాధ్యాయ,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థి యం.వి. రామచంద్రారెడ్డి మరియు వెన్నపూస రవీంద్రారెడ్డి గిఫ్ట్ బాక్స్ లు,తాయిలాలు పంపిణీ చేస్తున్నారని,అధికార బలం,తాయిలాల తో ఉపాధ్యాయుల,పట్టభద్రుల ఆత్మ గౌరవాన్ని వెలకట్టీ కొనలేరనీ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శులు శ్రీరాములు గౌడ్,కారుమంచి లు విమర్శించారు. ఈ మేరకు బుధవారం పత్తికొండ లో వివిధ కళాశాలలు, పాఠశాలలు తిరిగి ప్రచారం నిర్వహించి సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు తాయిలాలను,గిఫ్ట్ బాక్స్ లను తిరస్కరించిన విషయంపై ఉపాధ్యాయులలో అంకితభావంతో ఉన్నారని అభినందిచారు.అధికార దాహంతో,అధికారమును అడ్డం పెట్టుకొని ఉపాధ్యా యుల,పట్టభద్రుల ఓట్లను కొంటాం, బోగస్ ఓట్లతో గెలుస్తామని విర్రవిగితే తగిన బుద్ధి చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికల లో ప్రభుత్వ అభ్యర్థులను ఓడించి గుణపాఠం చెప్పడానికి ఉపాధ్యాయులు,పట్టభద్రులుఅందరూ సిద్ధపడాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్సీ ఎన్నికల లో ఉద్యమ నాయకులను, వామపక్ష భావజాల అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.గిఫ్ట్ లు, తాయిలాలు విషయమై త్వరలోనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి పిర్యాదు చేస్తామని తెల్పారు.నెల నెలా ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేని,సకాలం లో కరుభత్యం ఇవ్వలేని,సిపియస్ రద్దు హామీని విస్మరించిన, ఉద్యోగులకు ఉపాధ్యాయుల కు పీఆర్సీ బకాయిలు, జిపీఫ్, జీవిత భీమా సొమ్ములు చెల్లించలేని అధికార అభ్యర్థులు యం.వి.రామచంద్రారెడ్డి,వెన్నపూస రవీంద్రారెడ్డిని చిత్తుగా ఒడిస్తామని తెలిపారు.ఉపాధ్యాయులు కానివారు,ఎన్నారై డాక్టర్లు, వ్యాపారస్తుల కు ఉపాధ్యాయుల,విద్యార్థుల,నిరుద్యోగుల,పాఠశాలల సమస్యల పై ఏమి అవగాహన ఉంటుందని, వీరందరికీ గుణ పాఠం చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు .జాతీయ విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు 3,4,5, తరగతుల విలీనం విద్యావ్యవస్థకు గొడ్డలి పెట్టు అని, తక్షణం విరమించుకావాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా ఎస్టీయు మరియు యూటీఎఫ్ సంఘాల ఉమ్మడి అభ్యర్థి కత్తి నరసింహ రెడ్డి గారిని, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా పోతుల నాగరాజు గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శులు అల్తాఫ్, బీసన్న,జిల్లా కార్యవర్గ సభ్యుడు మోహన్, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి నజీర్,నాయకులు శివ,రవి, హరి తదితరులు పాల్గొన్నారు.

About Author