మీలో సమయపాలన లేదు..ఇలాగైతే ఎలా..
1 min read– గడప గడపలో మండలాన్నే చుట్టేసిన ఎమ్మెల్యే -ప్రమాదాలు జరుగుతున్నాయ్ స్పీడ్ బ్రేకర్లు వేయించండి -మిడుతూరులో రెండవ రోజున గడప గడపలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్థర్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మీరు మీవిధులకు సమయపాలన పాటించడం లేదు ఇలాగైతే ఎలా నేను వచ్చినప్పుడు అంగన్వాడి సిబ్బంది మాత్రమే ఉన్నారు మిగతావారు ఎవ్వరూ ఇక్కడ లేరని నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ అధికారులతో అన్నారు.శనివారం ఉదయం 10 గంటలకు మిడుతూరు గ్రామంలో రెండవ రోజున గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.మిగిలిన 120 ఇండ్ల దగ్గరికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు.అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పిల్లలతో ఎమ్మెల్యే ముచ్చటించారు.పిల్లలకు ఏమేమి భోజనం అందిస్తున్నారని వారికి శుభ్రంగా భోజనం నాణ్యతగా ఉండాలని సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు.తర్వాత నందికొట్కూరు నంద్యాల ప్రధాన రహదారిలో ఉన్న ఇంట్లో దగ్గరికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కానీ ఇక్కడ ప్రధాన రహదారిలో అనునిత్యం వాహనాలు విపరీతంగా వేగంగా వెళుతూ ఉన్నాయని అంతేకాకుండా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని ఈమధ్య ఒకరు మృతి చెందడం జరిగిందని తప్పనిసరిగా ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయించాలని మహిళలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు.అదేవిధంగా ఇక్కడ నీళ్లు చాలా రోజుల నుంచి రావడం లేదని వారు ఎమ్మెల్యేకు తెలిపారు.ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు మరియు నేటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.నాకోడలు మరణించిందని నా మనవడు అయినా మల్లెపూల సాయి మాధవ 8వ తరగతి చదువుతున్నాడని ఇంతవరకు అమ్మ ఒడి డబ్బులు రాలేదని ఎందుకని అడిగితే ఏవో సాకులు చెబుతున్నారని అంతేకాకుండా మాకు ఇంటి స్థలం వచ్చిన దానిని వెనక్కు తీసుకున్నారని మల్లెపూల వెంకట లక్ష్మమ్మ ఎమ్మెల్యేతో కన్నీటి పర్యంతమయ్యారు.అమ్మఒడి డబ్బులు ఎందుకు రాలేదని చిన్న చిన్న కారణాలతో పథకాలను ఆపవద్దని ఎమ్మెల్యే సిబ్బందితో అన్నారు.ఈమెకు వెంటనే ఇంటి స్థలం ఇవ్వాలని వీఆర్వో వెంకటయ్యను ఎమ్మెల్యే ఆదేశించారు.పింఛన్లు మాత్రమే పొద్దున్నే వచ్చి నిద్ర నుంచి లేపి పింఛన్లు మాత్రమే ఇస్తారు తప్పా మిగతా పథకాలు ఏవి కూడా మాకు రావడంలేదని రసూల్ మియ్య అన్నారు.చివరగా గడప గడప ముగిసిన అనంతరం ఎమ్మెల్యే సిబ్బందితో సమావేశమై ఇక్కడ మొత్తం 14 సచివాలయాలు ఉన్నాయని ఇవన్నీ కూడా ఈరోజుతో గడప గడప కార్యక్రమం పూర్తి చేశానని అంతేకాకుండా తాలూకాలో కొత్తపల్లి,జూపాడుబంగ్లా, పాములపాడు,మిడుతూరు మండలాల్లో అందరి సహకారం వల్ల గడప గడప కార్యక్రమం పూర్తి చేశానని అన్నారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క సమస్యను కూడా మీ బాధ్యతగా గుర్తించి ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే అధికారులపై ప్రజల్లో విశ్వాసం పెంపొందుతుందని అన్నారు. అంతేకాకుండా సమయం చాలా ముఖ్యమైనది సమయపాలన చాలామంది పాటించడం లేదు.నేను వచ్చిన తర్వాత కూడా చాలాసేపటికి కొందరు ఇంకా వస్తూనే ఉన్నారని అలా ఉంటే ఎలా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. అధికారులు వస్తుంటారు పోతుంటారులే అన్న భావన ప్రజల్లో రాకూడదని మీరు దేనినైనా సంపాదించుకోవచ్చు గాని సమయం మళ్ళీ రాదని మీరంతా కష్టపడి పని చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ అధికారులతో అన్నారు.ఈకార్యక్రమంలో కడుమూరు గోవర్ధన్ రెడ్డి,నందికొట్కూరు సహకార సొసైటీ చైర్మన్ ఉశేనయ్య,కాల రమేష్,సీతారాముడు,వీరారెడ్డి, ఇనాయతుల్ల,చంద్రశేఖర్ రెడ్డి మరియు అధికారులు పాల్గొన్నారు.