PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మా పూర్తి మద్దతు మీకు ఉంటుంది… షేక్ గౌస్  

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు:  కైకలూరు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి అంబేద్కర్ నగర్ గ్రామానికి చెందిన రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు సేవా. నాగ జగన్ బాబు రావు  కుటుంబ సభ్యులను పరామర్శించి పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించే షేక్ గౌస్.ఈ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ గౌస్, ముస్లిం మైనారిటీస్ మహిళా విభాగం అధ్యక్షులు షేక్ కరీమునిస బాబురావు ని వారి కుటుంబాన్ని పరామర్శించి, వారికి మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించడం జరిగింది. సందర్భంగా గౌస్  మాట్లాడుతూ రాష్ట్ర మాలమహానాడు & అనుబంధ సంఘాల అధ్యక్షులు డాక్టర్ సేవా నాగ జగన్ బాబురావు  కులమత బేధం లేకుండా ఎంతోమందికి ప్రతి విషయంలో అండగా ఉన్నటువంటి వ్యక్తి అని అటువంటి వ్యక్తి మీద తప్పుడు కేసులు పెట్టి బాబురావు  వారి కుటుంబాన్ని పోలీసులు చేత వేధించడాన్ని, తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాము అన్నారు.,బాబురావు త్వరలో ఏ నిర్ణయం తీసుకున్నా మన ముస్లిం మైనారిటీస్ అందరూ అండగా ఉంటామని మా ముస్లిం మైనారిటీస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి. హాజీ సర్వర్ బేగ్  దృష్టిలో పెట్టి రాష్ట్ర ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా బాబురావు  అతని కుటుంబానికి అండగా ఉండాలని మా రాష్ట్ర అధ్యక్షులు కూడా తెలియజేస్తానని గౌస్ అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ .రసిన బేగం, షేక్ .అబ్దుల్ సత్తార్, తదితరులు పాల్గొన్నారు.

About Author