మీరు త్వరగా కోలుకోవాలి : జూ.ఎన్టీఆర్
1 min read
పల్లెవెలుగువెబ్ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారాలోకేష్ త్వరగా కోలుకోవాలని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కోరుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘మావయ్య చంద్రబాబు నాయుడుగారు మరియు లోకేష్.. కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలి. త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతులుగా తిరిగిరావాలని కోరుతున్నాను..’’అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు త్వరగా కోలుకోవాలని సీఎం జగన్, చిరంజీవి కూడ ట్వీట్ చేశారు.