paytm కంపెనీలో మీరూ భాగస్వామి కావొచ్చు.. ఇలా చేస్తే..!
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎమ్.. త్వరలో పబ్లిక్ ఇష్యూకి రాబోతోంది. పబ్లిక్ ఇష్యూ అంటే..స్టాక్ మార్కెట్ లో పేటీఎమ్ కంపెనీ లిస్ట్ అవుతుంది. అప్పుడు ఎవరైన సరే ఆ కంపెనీలో షేర్లు కొనవచ్చు. తద్వార కంపెనీలో మనం కూడ భాగస్వామి కావొచ్చు. ఫలితంగా కంపెనీ అభివృద్ధి చెందితే.. మన షేర్ విలువ కూడ పెరుగుతుంది. దాని ద్వార మనకు లాభం వస్తుంది. ప్రస్తుతం పేటీఎమ్ సంస్థ ఇంకా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవ్వలేదు. కానీ అనధికార మార్కెట్ లో పేటీఎమ్ షేరు ధర అమాంతం పెరిగిపోయింది. పేటీఎమ్ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. కంపెనీ భవిష్యత్తు బాగుంటుందన్న నమ్మకంతో పేటీఎమ్ షేర్లు కొనుగోలు పట్ల ఆసక్తి నెలకొంది. అక్టోబర్ లేదా డిసెంబర్ లో పేటీఎమ్ పబ్లిక్ ఇష్యూ కి వస్తుంది. దీని ద్వార 22,000 కోట్లు సమీకరించే ఉద్దేశంలో ఉంది.