NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగన్..వంద తప్పులు చేశావు..ఇక క్షమించరు…!

1 min read

భవనం నిర్మించే వాడిని ఎన్నుకోండి.. కూల్చేవాడిని కాదు…

  • కర్నూలు ఎంపీగా నాగరాజును, ఎమ్మెల్యేగా టీజీ భరత్​ను గెలిపించండి…
  • హిందూపురం ఎంపీ అభ్యర్థి, సినీహీరో నందమూరి బాలకృష్ణ
  • బాలయ్య రాకతో… అభిమానుల సందడి…

కర్నూలు, పల్లెవెలుగు:శిశుపాలుడు వంద తప్పులు చేసినట్లు…. సీఎం జగన్​ మోహన్​ రెడ్డి కూడా వంద తప్పులు చేశాడని…. ఇక క్షమించరాదన్నారు హిందూపురం కూటమి ఎంపీ అభ్యర్థి , సినీహీరో నందమూరి బాలకృష్ణ. భవనం నిర్మించే వాడిని ఎన్నుకోవాలని… కూల్చేవాడిని కాదని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సినీహీరో నందమూరి బాలకృష్ణ కర్నూలులో కూటమి తరుపున విస్తృత ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఆస్తిలో సగభాగం మహిళలకు ఉండాలన్న సదుద్దేశంతో మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు. అదేవిధంగా రేషన్​ బియ్యం పథకం తీసుకొచ్చాడన్నారు. అలాగే పొదుపు మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పొదుపు పథకం తీసుకొచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసి… ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చిందని, సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన హీరో బాలకృష్ణ… కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, అసెంబ్లీ అభ్యర్థి టీజీ భరత్​ను గెలిపించాలని ప్రజలను, అభిమానులను కోరారు. సినీహీరో నందమూరి బాలకృష్ణ రాకతో కర్నూలు అభిమానులు సందడి చేశారు. కార్యక్రమంలో రాజ్య సభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్​, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author