NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బార్ అసోసియేషన్ సభ్యత్వం తీసుకున్న యువ న్యాయవాది

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  పత్తికొండ మండలము దూదేకొండ గ్రామానికి చెందిన “యడవల్లి సుధాకర్” అనే యువ న్యాయవాది పత్తికొండ జూనియర్ సివిల్  కోర్టు బార్ అసోసియేషన్లో గురువారం నూతనంగా సభ్యత్వం స్వీకరించారు. జూనియర్ సివిల్ కోర్టు జడ్జి రాహుల్ అంబేడ్కర్ , బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.రంగస్వామి మరియు సీనియర్ న్యాయవాదుల సమక్షంలో జూనియర్ న్యాయవాదిగా బార్ అసోసియేషన్ లో నూతన సభ్యత్వం తీసుకున్నారు. న్యాయవాదులు సామాజిక బాధ్యతను గుర్తించి గౌరవప్రదమైన న్యాయవాద వృత్తిలో రాణించాలని జూనియర్ సివిల్ జడ్జి రాహుల్ అంబేద్కర్ ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో  బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మహేష్, సీనియర్ న్యాయవాదులు సురేష్ కుమార్, హెచ్ కే లక్ష్మన్న, సత్యనారాయణ, నాగేష్, పంపాపతి, మల్లికార్జున, సురేంద్ర కుమార్, రమేష్ బాబు, కృష్ణయ్య, నరసింహయ్య, బాలభాష, మధుబాబు, నాగ లక్ష్మయ్య, జటంగి రాజు,  వై శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్, సుధాకృష్ణ,  వెంకటేశ్వర్లు, అరుణ్, రవికుమార్, భాస్కర్, మునెయ్య, నెట్టేకల్లు,  నరసింహులు, హరికృష్ణ, రజాక్ పాల్గొన్నారు.

About Author