యువత ‘సేవ’ చేయాలి
1 min read– టీడీపీ నియజకవర్గ ఇన్చార్జ్ టీజీ భరత్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: సేవా కార్యక్రమాలకు యువత కేరాఫ్‌గా నిలవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ టీజీ భరత్ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలని బుధవారపేట ఆదరణ డే కేర్ సెంటర్లో ఆయన వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు వృద్ధాశ్రమం నిర్వహిస్తూ సమాజ సేవ చేస్తున్న రంజిత్‌ను ఈ సందర్భంగా టీజీ భరత్ అభినందించారు. వృద్ధులకు సహాయం చేయాలన్న ఆలోచన ఎంతో ఉత్తమమైందన్నారు. యువత కూడా ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. టీజీవీ సంస్థల ద్వారా ఓల్డేజ్ హోంకు ఎప్పుడూ సహకారం అందిస్తామన్నారు. ప్రజా సమస్యలను స్థానిక నాయకుడు పామన్న దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరిగిపోతున్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హ్యాండ్ డిసెబ్యుల్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు రంజిత్, వంశీ, శ్రీనివాసులు, సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.